పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్, బోనీ కపూర్ కలిసి నిర్మించారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాపై ఫిల్మ్ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఒక పవర్ఫుల్ కథ ఉన్న సినిమాలో నటించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. “మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్‌తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం. నివేద థామస్, అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు. తమన్ , డీఓపి వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీ కపూర్, దర్శకుడు వేణు శ్రీరామ్, మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నింటికి మించి ఇది మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు” అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో ‘వకీల్ సాబ్’ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆ ఇద్దరికీ పుష్పగుఛ్చాలు అందించి సినిమా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
Chiranjeevi watched ‘Vakeel Saab’ Movie