Thursday, December 26, 2024

త్రిషకు స్వాగతం చెప్పిన మెగాస్టార్! (వీడియో)

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో చిరు పక్కన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష సోమవారంనుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆమెకు మెగాస్టార్ బొకే ఇచ్చి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిరు, త్రిషతో యూనిట్లోని సభ్యులు ఫొటోలు దిగారు.

వాస్తవానికి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మెగాస్టార్ మూవీ ‘ఆచార్య’లో త్రిష నటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నారు. తాను ఆదివారంనుంచీ విశ్వంభర టీమ్ తో కలిసి పనిచేస్తున్నానంటూ త్రిష ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాజాగా తాను, త్రిష ఉన్న ఫోటోను, వీడియోను మెగాస్టార్ షేర్ చేస్తూ త్రిషకు స్వాగతం అంటూ కామెంట్ పెట్టారు.

చిరంజీవితో 18 ఏళ్ల తర్వాత కలసి నటిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని త్రిష అన్నారు.

వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న విశ్వంభర మూవీని 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ తెరకు ఎక్కిస్తోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. సంగీతం కీరవాణి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News