Saturday, January 18, 2025

నన్ను ఇంతలా నవ్వించిన సినిమా లేదు.. హ్యాట్సాఫ్: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన తాజా సినిమానే ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

“నిన్ననే ‘మత్తు వదలరా-2’ చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము.. హ్యాట్సాఫ్” అని ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో సత్య కామెడికి థియేటర్లలో పడిపడి నవుతున్నారు ప్రేక్షకులు. ఇక, హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News