Saturday, February 22, 2025

పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై ప్రముఖ నటుడు చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరపించిన నిన్ను చూస్తుంటే అన్నగా గర్వంగా ఉంది’ అన్నారు.

నువ్వు గేమ్ ఛేంజర్ వే కాదు, మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్ వి అని అందరూ  కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది అన్నారు.

‘నీవు ప్రారంభించే కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అంటూ ఎక్స్ వేదికలో రాసుకొచ్చారు. కాగా నెటజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News