Wednesday, January 22, 2025

‘వాల్తేరు వీరయ్య’ మీ అంచనాలకు మించే వుంటుంది: మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

మనల్ని ఎలా చూపిస్తే బావుంటుందో అభిమానికే బాగా తెలుసు..
‘వాల్తేరు వీరయ్య’ మీ అంచనాలకు మించే వుంటుంది: మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు వున్న వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. వాల్తేరు వీరయ్య కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ప్రెస్ మీట్ లో… మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Chiranjeevi's Waltair Veerayya Movie Press Meet

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే ఇదే ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ లా వుంది. చాలా అద్భుతంగా వుంది. వాల్తేరు వీరయ్య సినిమాని అందరూ ప్రేమతో చేశారు. ఆ ప్రేమ వాల్తేరు వీరయ్య ప్రతి ఫ్రేమ్ లో ప్రతిబింబిస్తుంది. దర్శకుడు బాబీ కథ చెప్పినపుడు వినగానే నచ్చింది. ఇందులో కంటెంట్ బావుంది. కథపై వర్క్ చేసుకొని రమ్మన్నాను. బాబీ కథపై వర్క్ చేసుకొని వచ్చారు. మొత్తం వినగానే ఆ రోజే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. అదే నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇంత భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించడం ఆనందంగా వుంది. మనల్ని ఎలా చూపిస్తే బావుంటుందో అభిమానికే బాగా తెలుసు. అలాంటి అభిమాని దర్శకుడు గా వస్తే తప్పకుండా సినిమా చేయాలని ఒక సినియర్ హీరో చెప్పిన మాట నాలో ఎప్పటినుండో నాలో నాటుకుపోయింది.

 

బాబీ, వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్సో నాకు తెలుసు. బాబీ ఈ కథతో వచ్చినపుడు తప్పకుండా గొప్పగా తెరపై ఆవిష్కరిస్తాడనే నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజు నిజమైయింది. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. చాలా గొప్పగా అందంగా చూపించాడు బాబీ. గొప్ప ఎమోషనల్ జర్నీ. బాబీ కి అడ్వాన్స్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్యపై ఎన్ని అంచనాలు పెంచుకున్నా దానికి మించే వుంటుంది. వాల్తేరు వీరయ్య సమిష్టి కృషి. నాతో సినిమా అంటేనే దేవిశ్రీ ఎక్సయింట్ మెంట్ వేరు. ఇందులో అన్నిపాటలు అద్భుతంగా ఇచ్చాడు. మాస్ , క్లాస్, హృదయాన్ని కట్టిపడేసి పాటలు అన్నీ ఇందులో వున్నాయి. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. చంద్రబోస్ చక్కని సాహిత్యం అందించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎక్స టార్దీనరీ వర్క్ చేశారు. అలాగే పీటర్ హెయిన్స్ కూడా ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చాలా వండర్ ఫుల్ వర్క్ చేశారు. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ ని పట్టేశారు.

Chiranjeevi's Waltair Veerayya Movie Press Meet

ఇందులో గ్యాంగ్ లీడర్ రోజులని గుర్తు చేసే కొన్ని మూమెంట్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. మా డీవోపీ ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఫైటర్స్ తో కలసి ఎలాంటి డూప్ లేకుండా పని చేస్తున్నపుడు మా డీవోపీ ఆశ్చర్యపోయారు. ఇలా ఏ హీరో చేయరని చెప్పారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు కానీ నాకు తెలిసిన విధానం ఇదే అని చెప్పాను. ఊర్వశి అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసింది. బాస్ పార్టీ పాట కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. శ్రుతి హాసన్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమాలో చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News