Thursday, January 23, 2025

మెగా ఫ్యాన్స్ కు దీపాళి కానుక..

- Advertisement -
- Advertisement -

Chiranjeevi's 'Waltair Veerayya' title teaser out

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ(కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపు దిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మెగా 154’. దీపాళి కానుకగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానినికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో చిరు లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. కాగా, మాస్ మహారాజా రవితేజ ఈ మూవీలో పవర్ ఫుల్‌లో పోషిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Chiranjeevi’s ‘Waltair Veerayya’ title teaser out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News