Monday, December 23, 2024

చిరు పేరును క్రాప్ చేయించుకున్న ఆ హీరో ఎవరో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉప్పెన్ హిట్ కావడంతో చిరంజీవి మేనల్లుడు అనిపించుకున్నాడు వైష్ణవ్. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ‘ఆదికేశవ’ సినిమాలో తేజ్ నటిస్తున్నారు. ఈ నెల 24 ఆదికేశవ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా వైష్ణవ్ సరసన శ్రీలీల నటించారు. తాజగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

ఈ సందర్భంగా వైష్ణవ్ ఇంటర్యూ ఇచ్చారు. చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. చిరు జన్మదినం రోజున అందరూ బహుమతులు ఇచ్చామని. సాయి ధరమ్ పెద్ద కత్తిని గిఫ్ట్‌గా ఇవ్వగా తాను తన ప్రాణం తప్ప ఏమీ ఇవ్వగలను అని అన్నాడు. మామయ్య సర్‌ప్రైజ్ చేద్దామని చిరు అనే ఇంగ్లీష్ అక్షరాలను క్రాప్ చేయించుకొని వేడకకు వచ్చానని వివరించాడు. రామ్‌చరణ్ అందరినీ ఆకట్టుకుంటాడని, హుందాగా ఉంటాడని ప్రశంసించాడు. సాయిధరమ్ తేజ్ బాగా అల్లరి చేయడంతో పాటు నవ్విస్తాడని, ఆయన బైక్ ప్రమాదం అందరికీ చేదు జ్ఞాపకమన్నారు. కానీ ఎప్పుడో మరిచిపోయామన్నారు. విలన్‌గా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వైష్ణవ్ వివరణ ఇచ్చాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News