Sunday, April 13, 2025

రోడ్డు ప్రమాదం…. యువతిని చంపి ఆస్పత్రిలో చేర్పించిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: యువతిని హత్య చేసి అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిందని ఆస్పత్రిలో చేర్పించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓబయ్యనహట్టి గ్రామానికి చెందిన లోహిత్ అనే యువకుడు ఓ యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడిందని చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే యువతి మృతి చెందిందని వెల్లడించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో నేత్రావతి(27)గా గుర్తించారు. మృతురాలి తల్లి లోహిత్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. వెంటనే అతడిని నిర్థడి గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతడిని తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించామని అతడు ఒప్పుకున్నాడు. నేత్రావతి, లోహిత్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా ఇద్దరు మధ్య ఫోన్ కాల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం హత్యకు దారి తీసినట్లు తెలిసింది. పోలీసులు లోహిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News