Monday, December 23, 2024

వరుణ్ సందేశ్ ‘చిత్రం చూడర’ టీజర్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’ చేస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో శీతల్ భట్ కథానాయికగా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

ఇంటి గోడపై కూర్చున్న వరుణ్ సందేశ్, ధనరాజ్,  కాశీ విశ్వనాథ్‌ల సస్పెన్స్ ఫేస్ లని  ప్రజెంట్ చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. వరుణ్ సందేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని గా కనిపించారు. వరుణ్  క్రైమ్‌లో ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ భాగస్వాములు. కోర్ పాయింట్‌ను రివిల్ చేయకుండానే టీజర్ సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకొని, సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.

అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ధన తుమ్మల సహ నిర్మాత. టాలెంటెడ్ కంపోజర్ రధన్ సంగీతం అందిస్తుండగా, జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. నేనింతే ఫేమ్ అదితి గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో అలరించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News