Monday, January 20, 2025

బిజెపిలో చేరిన చిత్తరంజన్‌దాస్, కృష్ణ యాదవ్

- Advertisement -
- Advertisement -

కండువాలు కప్పి స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి సమక్షంలో.. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్,జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, తల్లోజీ ఆచారి ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరాంజన్‌దాస్, సిర్పూర్ జడ్పీటిసి రేఖ సత్యనారాయణ, బండల రామచంద్ర రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు.

వారికి కండువాలు కప్పి కేంద్రమంత్రి స్వాగతించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలు.. బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నాటకాలను గమనిస్తున్నారని.. దీనికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారని వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయమని.. 90 రోజుల తర్వాత కెసిఆర్ కుటుంబం ఫాంహౌజ్ కు పరిమితం కావడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లు రాష్ట్రాభివృద్ధి కోసం ఖర్చుపెట్టిందన్నారు. ముఖ్యమంత్రికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్‌లో ఉండేది 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫామ్ హౌస్‌లోనే ఉండబోతున్నారు. బిఆర్‌ఎస్ హఠావో.. తెలంగాణ బచావో… ఇది తెలంగాణ ప్రజల నినాదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ .. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోంది. వాళ్లు 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణ సమాజం నమ్మదు అన్నారు. – ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్‌లో ఒకటో తేదీన, 3న ఇందూరుకు రానున్నారు. దాదాపు రూ. 20 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారని వెల్లడించారు.

నేటి నుంచి స్వచ్ఛభారత్…
అక్టోబరు ఒకటో తేదీన దేశంలోని ప్రతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రతి కాలనీ, బస్తీలో నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు.- అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.

బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి: ఈటల
కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయి.. అలాంటి రాతలు రాయటం తగదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి అని రాష్ట్ర ప్రజల నిర్ణయించకున్నారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో పాతికేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్, వైఎస్‌ఆర్సీపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధీర్ , ఆ పార్టీలకు రాజీనామాలు చేసి వందలాదిమంది కార్యకర్తలు, నాయకులతో బిజెపిలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ డంకా మోగించి బిజెపి సత్తాను చాటుతాం. అబద్ధపు ప్రచారాలు నమ్మి అగం కావద్దని కోరుకుంటున్నాను.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News