Monday, January 13, 2025

Chittoor: బ్యూటీ పార్లర్‌లో యువతి, యువకుడు రక్తపు మడుగులో…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ బ్యూటీ పార్లర్‌లో యువతి అనుమానాస్పదంగా మృతి చెందగా యువకుడు రక్తపు మడుగులో కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగరాజు అనే వ్యక్తి చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నాగరాజు కూతురు దుర్గా ప్రశాంతి(23) ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తుంది. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన చక్రవర్తి అనే యువకుడు(31) రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో కొత్తగూడెం నుంచి మకాం చిత్తూరుకు మూడు నెలల క్రితం మార్చడంతో పాటు దుకాణం నిర్వహిస్తున్నారు.

Also Read: లవర్ ఇంట్లో బాలిక ఆత్మహత్య

మంగళవారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చి ప్రశాంతితో చక్రవర్తి గొడవకు దిగాడు. ఇద్దరు బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్లారు. బ్యూటీ పార్లర్ నుంచి అలజడి లేకపోవడంతో స్థానికులు లోపలికి వెళ్లారు. ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. యువకుడి గొంతు, చేతులపై గాయాలున్నట్టు వైద్యులు వ్లెలడించారు. చక్రవర్తికి మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చక్రవర్తి గాయాల నుంచి కోలుకొని నోరువిప్పితే నిజాలు బయటకు వస్తాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News