Monday, December 23, 2024

యువతిపై అత్యాచారం?… కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ యువతిపై అత్యాచారం చేయడంతో పాటు కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేణుగోపాలపురం గ్రామంలో మునికృష్ణ, పద్మావతి అనే దంపతులు నివసిస్తునానరు. ఈ దంపతులకు భవ్య శ్రీ అనే కుమార్తె ఉంది. తన కూతురు కనిపించడంలేదని ఈ నెల 18న స్థానికల పోలీస్ స్టేషన్‌లో దంపతులు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులపై అనుమానం ఉందని ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.

ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వినాయక నిమజ్జనం కోసం స్థానికులు కొందరు బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయగా జట్టు కత్తిరించి, కళ్లు పీకేసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న బంగారాన్ని బట్టి తమ కూతురేనని మునికృష్ణ గుర్తించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించే ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News