Monday, December 23, 2024

సినిమా రిహార్సల్‌లో గాయపడ్డ హీరో చియాన్ విక్రమ్..

- Advertisement -
- Advertisement -

చెన్నైః సినిమా రిహార్సల్‌లో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రెమ్ గాయపడ్డారు. ఇటీవల ‘పిఎస్-2’తో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ తన తర్వాతి చిత్రం ‘తంగలాన్‌’లో నటిస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కోసం విక్రమ్ రిహార్సల్ చేస్తున్నాడు.

ఈ సమయంలో విక్రమ్ పక్కటెముక విరిగినట్లు తెలుస్తోంది. తాజాగా తన గాయంపై హీరో విక్రమ్ స్పందిస్తూ.. ‘తంగలాన్ సినిమా రిహార్సల్‌లో దెబ్బ తగిలింది. గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. నా పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. వీలైనంత త్వరగా మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా’ అని పేర్కొన్నారు.

Also Read: అభిమానితో షారూఖ్ దురుసు ప్రవర్తన.. నెటిజన్ల ఆగ్రహం(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News