Sunday, January 19, 2025

మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ‘చియాన్ 63’

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్… మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ‘చియాన్63’అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3 గా నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శుక్రవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మడోన్ అశ్విన్… విక్రమ్‌కు సరిపోయే సబ్జెక్ట్‌తో సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ “దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్‌తో కలిసి మా ప్రొడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రానికి మండేలా, మావీరన్‌లను అందించిన అత్యుత్తమ డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News