Monday, December 23, 2024

‘ఛలో మైదాన్’ కు భారీగా యువతరం

- Advertisement -
- Advertisement -

ఈనెల 29న 33 జిల్లా కేంద్రాల్లో యువ స్ఫూర్తి సభలు
ఎంఎల్ ఏలు, జిల్లా కలెక్టర్‌లను ఆహ్వానించి యువతలో చైతన్యం నింపాలి
సమీక్ష సమావేశంలో శైలజా రామయ్యర్.. ఆంజనేయ గౌడ్‌ల సూచన

మన తెలంగాణ /హైదరాబాద్ : యువతకు స్పూర్తి దినంగా క్రీడా దినోత్సవాన్ని ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ఈ నెల 29న పండగలా నిర్వహించాలని క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్‌లు అధికారులకు సూచించారు. ఈ మేరకు 33 జిల్లాల డివైఎస్‌వోల సమీక్ష సమావేశం గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ క్రీడా రంగం లోకి కొత్త తరాన్ని నడిపించే బాధ్యత స్పోర్ట్ అథారిటీ అధికారులతో పాటు సమాజంలోని ప్రగతి శీలురందరిపై ఉందన్నారు.

క్రీడా కారులకు సిఎం కెసిఆర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని , ప్రభుత్వ క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను యువతకు అవగాహన కల్పించాలన్నారు. క్రీడల వల్లే ఆరోగ్యం, అభివృద్ధి సాధ్యమనే వాస్తవాలను నవతరంలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆంజనేయ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర యువతలో నైపుణ్యాలకు కొదవలేదని, సరైన దారిలో నడిపితే అపూర్వ విజయాలు సాధిస్తారని అన్నారు.పల్లె ల నుంచి ప్రపంచ చాంపియన్‌లను అందించాలనే ఆశయంతోనే సిఎం కెసిఆర్ 18 వేలకుపైగా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించారన్నారు.

సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా, యువ లోకాన్ని క్రీడా మైదానాలకు నడిపించేందుకు చలో మైదాన్ కార్యక్రమాన్ని ఈ నెల 29న అన్ని జిల్లా కేంద్రాల్లో , ఉత్సహపూరిత వాతావరణం లో నిర్వహించాలని సూచించారు. స్థానిక ఎంఎల్ ఏలు, జిల్లా కలెక్టర్‌లు ఇతర ముఖ్యులను ఆహ్వానించి యువతలో నూతన చైతన్యం నింపాలని అన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని,ఇతర మంత్రులను ఆయా జిల్లాల్లో నిర్వహించే క్రీడా దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వనించాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ శ్రీ లక్ష్మీ ఇతర స్పోర్ట్ అథారిటీ అధికారులు, జిల్లా ల డివైఎస్‌వోలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News