Monday, December 23, 2024

ఎనిమిదేళ్ల పాపకు దగ్గు, ఆయాసం, ఆమె ఊపిరితిత్తుల్లో ఏం ఉందంటే…

- Advertisement -
- Advertisement -

ఎనిమిదేళ్ల పాప బాగా దగ్గుతూ ఉంటే, న్యూమోనియా కాబోలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లాక తెలిసింది, ఆ పాప ఊపిరి తిత్తుల్లో చాక్లెట్ రేపర్ ఉందని.

ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల పరి సోలంకి అనే పాపకు రెండు వారాల క్రితం దగ్గు మొదలైంది. తల్లిదండ్రులు న్యూమోనియా అని అనుమానించారు. దగ్గు ఎంతకీ తగ్గకపోగా, పాప ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దాంతో కంగారు పడిన పరి తల్లిదండ్రులు ఆమెను దగ్గర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదట డాక్టర్లకు కూడా ఏమీ పాలుపోలేదు. తీరా ఎక్స్ రే తీయిస్తే బయటపడిదేంటంటే- ఆ పాప ఊపిరితిత్తుల్లో చాక్లెట్ కాగితం ముక్క ఒకటి ఇరుక్కుందని. దానివల్లే పాప దగ్గుతోనూ, ఆయాసంతోనూ బాధపడుతోందని.

వెంటనే డాక్టర్లు బ్రాంకోస్కోపీ చేసి, చాక్లెట్ కాగితం ముక్కని తీసేశారు. మరికొన్ని రోజులు ఆలస్యమై ఉంటే, ఊపిరితిత్తులు ఇన్పెక్షన్ తో దెబ్బతినేవనీ, అప్పుడు ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించవలసి వచ్చేదనీ డాక్టర్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News