Wednesday, January 22, 2025

ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి

- Advertisement -
- Advertisement -

ఔత్సాహిక పెట్టుబడిదారులు 500 నుండి ఐదువేలకు చేరేలా కార్యాచరణతో ముందుకు
గిరిజనుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటును ఆలోచిస్తాం
టాలెంట్ ఉంటే ఏ కులమైనా, ఏదైనా సాధించవచ్చు
గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్‌లో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలని, గొప్పగా కలలను కలని అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకునే స్ఫూర్తి కలుగుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ లో జరిగిన గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ డిసెంబర్ మూడోతేదీన మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు. ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని బలంగా నమ్ముతానని ఆయనన్నారు. టాలెంట్ అనేది ఒక్కరి సొత్తు ఏమాత్రం కాదని సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిఎం ఎస్‌టిఈ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలని సూచించారు. గ్రామాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గుడాలలో ఉన్న యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం ఉందని ఆయనన్నారు. గత ఐదు సంవత్సరాలలో ఈ కార్యక్రమం నడిచిన తీరుపైన అధ్యయనం నిర్వహించి దీన్ని మరింతగా బలోపేతం చేసి, విస్తరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 500 మంది ఉన్న ఔత్సాహిక పెట్టుబడిదారుల సంఖ్యను ఐదువేలకు చేరేలా కార్యాచరణ నిర్వహించుకుందామని మంత్రి చెప్పారు. గిరిజన సోదరుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలన్న సూచన పైన సానుకూలంగా ఆలోచిస్తామన్నారు.

దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్‌నెస్ అనే మంత్రం దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారంలో చాలా ఇబ్బంది పడ్డా, కానీ ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుందని కెటిఆర్ చెప్పారు. సిఎంఎస్‌టిఈఐ ఎన్నో వ్యాపారాలు బయట దేశానికి కూడా వెళ్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతిదాన్ని పెద్దగా ఆలోచించాలని, సింగిల్ మైండ్ విధానంతో ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఎన్నో ఓటముల తరువాతే ఈ స్థాయిలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కుల వ్యవస్థ అనేది కేవలం మనుషులు మాత్రమే సృష్టించారని దేవుడు దీన్ని కనిపెట్టలేదని కెటిఆర్ అన్నారు. కులాల గురించి కుల వ్యవస్థ గురించి నాకు రాజకీయాల్లోకి వచ్చాకే తెలిసిందన్నారు. టాలెంట్ ఉంటే ఏ కులమైనా ప్రతీదీ సాధించొచ్చన్నారు. సిఎంఎస్‌టిఈఐ ప్రోగ్రాం తో 500 మంది వ్యవస్థాపకులు గా మారారని తెలిపారు. ఈ ప్రోగ్రాం లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క స్టోరీ తాండాలలో అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. దళిత బంధుతో ఎంతోమంది వ్యవస్థాపకులు గా మారారని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగారని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్‌లో కూడా గిరిజనులు తమ షేర్‌ని కొట్లాడి మరి తీసుకోవాలని కెటిఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారని అన్నారు. గిరిజన ప్రాంతాలను తాండాలను ఎంతో అభివృద్ధి చేశామని, కరెంటు లేని రోజు నుంచి కరెంటు చూసేలా చేసామన్నారు.
పారిశ్రామికవేత్తలుగా గిరిజనులు : సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్ర గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ వల్లే ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారవుతున్నారని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి కేసీఆర్ అన్నివిధాలు సహకారం అందిస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వాలు గిరిజనులను ఏ మాత్రం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో గిరుజనులు అభివృద్ధి చెందారని మంత్రి కొనియాడారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగారన్నారు. గిరిజన ప్రాంతాలను, తాండాలను ఎంతో అభివృద్ధి చేశామని, కరెంటు లేని రోజు నుంచి కరెంటు చూసేలా చేసామని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన బిడ్డలకు కొత్త జీవితాలనిచ్చారని, గిరిజనుల పై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. గిరిజన రిజర్వేషన్ పెంచుకున్నామని, అనేకమందికి మెడికల్ ఇంజనీరింగ్ సీట్లలో అవకాశాలు వచ్చాయని మంత్రి సత్యవతి చెప్పారు. గిరిజనులకు పోడుపట్టాలు అందింమన్నారు. గత ప్రభుత్వాల 65 ఏళ్ల పాలనలో 91 గిరిజన గురుకులాలు ఉంటే స్వరాష్ట్రంలో 98 ప్రత్యేక గురుకులాలు ఉన్నాయన్నారు. ప్రజల ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే తీవ్రంగా నష్టపోతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News