Thursday, January 23, 2025

చొప్పదండి ఎంఎల్ఎ సతీమణి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా :  చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూపాదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే సత్యం దంపతులు వారి కుటుంబంతో కలిసి అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఉన్న శ్రీ చక్ర అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. కొంపల్లి బిగ్ బాస్ లోని డయోరియా విల్లాస్ లో గతంలో నివాసం ఉంటుండే రెండు నెల క్రితమే అల్వాల్ కు మఖాం మార్చారు. పంచశీల కాలనీలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టు వెల్లడించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి వికారాబాద్ లో ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఉదయం ఎమ్మెల్యే సత్యం కుటుంబ సభ్యులతో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అల్వాల్ లోని రెనోవా ఆసుపత్రి కి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కలిసి రూపా దేవి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News