Monday, December 23, 2024

మేము పడిన శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చారు

- Advertisement -
- Advertisement -

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘చోర్ బజార్’. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ… మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది అని అన్నారు. దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ… చోర్ బజార్‌తో ఒక కలర్ ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలన్న మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది. అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తోంది అని చెపారు. నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ… సినిమా కోసం మేము పడిన శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత సురేష్ వర్మ, గీత రచయిత మిట్టపల్లి సురేందర్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.

Chor Bazar movie Unit Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News