Sunday, December 22, 2024

యువతే నన్ను వేధించింది: జానీ మాస్టర్

- Advertisement -
- Advertisement -

అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌కు పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్పినట్లు తెలిసింది. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని, మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని తెలిపారు. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానని, తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేదని,

దీనిపై ఎన్నోసార్లు బాధితురాలు తను బెదిరించిందని తెలిపారు. ఆమె వల్ల తాను పడుతున్న ఇబ్బంది గురించి డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సుకుమార్, యువతిని పిలిచి మాట్లాడినా కూడా యువతి ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పినట్లు తెలిసింది. తనపై కుట్ర జరిగిందని, వెనున ఉండి తనపై కుట్ర చేశారని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కేసులో ఇరికించారని పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలిసింది. పోలీసుల కస్టడీలో ఉన్న భర్తను కలవడానికి షేక్ జానీ భార్య ఆయేషా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా, శనివారంతో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. తర్వాత పోలీసులు జానీ బాషాను కోర్టుకు అప్పగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News