Friday, December 27, 2024

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంలో ఓ ఈవెంట్ వెళ్లిన ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. రక్త విరోచనాలకు గురైన రాకేశ్ మాస్టర్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ ఆయన ఆదివారం సాయంత్రం మృతిచెందారని గాంధీ వైద్యులు వెల్లడించారు.

ఆయన మృతిపట్ల ఆయన అభిమానులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆట డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన రాకేశ్ మాస్టర్ దాదాపు 1500 సినిమాలకు పైనే పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ పలు యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. అవి ఎప్పుడు వార్తాల్లో నిలిచేవన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News