Monday, January 27, 2025

మైసూర్ లో ఛోటా పాకిస్థాన్?… ఇద్దరు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

 

Chota Pakistan

నంజన్గుడ్: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశాన్ని ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్లు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది.  మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు.

మైసూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చేతన్ ఆర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరినట్లు బొమ్మై తెలిపారు.

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైజ్ , హన్నన్ అలీలను అరెస్టు చేశారు. కాగా వారు  నేరం ఒప్పుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వైరల్ వీడియోలో పెద్ద సంఖ్యలో ముస్లిం పురుషులు ప్రార్థనలు చేసిన తర్వాత రోడ్డు పక్కన నిలబడి నినాదాలు చేస్తున్నారు. పోలీసులు జనాన్ని చెదరగొడుతుండగా, వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి, “మా ఊరిలో గుమికూడడాన్ని చూడండి” అని చెప్పడం వినబడుతుంది. దీనికి, “యే భీ పాకిస్తాన్ హై, ఛోటా (ఇది కూడా పాకిస్తాన్, కానీ చిన్నది)” అని మరొక స్వరం చెప్పింది. అప్పుడు ఒక స్వరం, “కావలందే… బోలే తో… ఛోటా పాకిస్థాన్, ఠీక్ హై (కావలందే అంటే మినీ పాకిస్థాన్ అని అర్థం).”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News