Sunday, December 22, 2024

చౌటుప్పల్‌లో ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

చౌటుప్పల్: యాదాద్రి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సదరు మహిళలు తేజ ఫుడ్ ఇండస్ట్రీలో కూలీలుగా పని చేస్తున్నారు. ఆటోను ఫుడ్ ఇండస్ట్రీ బస్సు ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News