Thursday, January 23, 2025

చైనీస్ బ్రాండ్ చౌమాన్ ఇప్పుడు హైదరాబాద్ లో!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోల్‌కతా, బెంగుళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ఈస్టర్న్ లో విస్తరించటంతో పాటుగా అపూర్వ విజయం సాధించి భారత దేశంలో నంబర్ 1 చైనీస్ బ్రాండ్ గా వెలుగొందుతున్న “చౌమాన్” ఇప్పుడు హైదరాబాద్‌లో తమ మొదటి డైన్-ఇన్‌తో నిజాం నగరంలోకి ప్రవేశించింది. చైనీస్ రుచులకు తమ హృదయంలో పెద్ద పీటవేసుకున్న హైదరాబాద్‌లోని కాకోఫోనీల మధ్య వికసించిన చౌమాన్ యొక్క నినాదం “ఫైన్ డైనింగ్, నైబర్‌హుడ్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్ యొక్క ప్రజాస్వామ్యీకరణ”పై ఉంది. సాంప్రదాయ చైనీస్, థాయ్ వంటకాల శ్రేణిని కలిగి ఉన్న అత్యుత్తమ ఓరియంటల్ వంటకాలతో నూతన శిఖరాలకు చేరుకున్న చౌమాన్ ఈ రోజు హైదరాబాద్‌లో తన 32వ అవుట్‌లెట్‌ను ప్రారంభించటం ద్వారా మరో నగరాన్ని తమ జాబితాలో జోడించుకుంది.

అతిపెద్ద డెలివరీ ఫ్లీట్ & దాని స్వంత చౌమాన్ యాప్ తో ఈ బ్రాండ్, చివరకు తమ మొదటి డైన్-ఇన్ అవుట్‌లెట్‌తో నగరానికి చేరుకుంది. ప్లాట్ నెం-532 వద్ద 1178 చదరపు అడుగులు విస్తీర్ణంలో (రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా), వివేకానందనగర్ కాలనీ రోడ్ స్ట్రీట్, కూకట్‌పల్లి, హైదరాబాద్-500007, తెలంగాణ వద్ద ఇది వుంది. హాయిగా కూర్చునే ప్రదేశం, చైనీస్ పద్దతిలో అలంకరణలు, ఇంటీరియర్‌లను కూడి ఉండటం తో పాటుగా చైనీస్ వాయిద్య ట్యూన్‌తో ఆధిపత్యం చెలాయించే ఆహ్లాదకరమైన వాతావరణంతో చైనా యొక్క పురాతన వాతావరణానికి సమాంతరంగా చౌమాన్ తనలో ఒక ప్రపంచాన్ని నగరవాసుల ముంగిటకు తెస్తుంది.

ప్రామాణికమైన, చైనీస్ వంటకాలకు నిజంగా కట్టుబడి ఉండే దాని విలాసవంతమైన, రుచికరమైన వంటకాల్లో క్రిస్పీ ఫ్రైడ్ క్రాబ్ వోన్టన్స్, డబుల్ కుక్డ్ క్రిస్పీ చిల్లీ ఫిష్, పాన్ ఫ్రైడ్ చిల్లీ పనీర్ టు కుంగ్ పాయో చికెన్ వంటి స్టార్టర్‌ల ఎక్సోటిక్స్ స్ప్రెడ్‌పై డైనర్‌లు తమ ఆకలిని తీర్చుకుంటారు. ప్రాన్ ఇన్ రెడ్ కర్రీ, హునాన్ సాస్‌లో లాంబ్, మీకు నచ్చిన సాస్‌లో లాబ్‌స్టర్ తో పాటుగా బియ్యం, నూడుల్స్ వంటకాలైన ఆసియన్ గ్రీన్ ఫ్రైడ్ రైస్, సీఫుడ్ ఫ్రైడ్ రైస్, షాంఘై మైఫూన్, బెల్ పెప్పర్, బ్లాక్ మష్రూమ్‌తో బ్రైజ్డ్ నూడుల్స్ వంటి వి సైతం అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా, చౌమాన్ తన చెఫ్ యొక్క ప్రత్యేక వంటకాలను కూడా కలిగి ఉంది, ఇందులో చౌమాన్ యొక్క స్పెషల్ చికెన్ సూప్, & నూడుల్స్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News