Saturday, April 5, 2025

భారత క్రికెటర్లకు రేటింగ్ ఇచ్చిన క్రిస్ గేల్

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే.. సంచలనాలకు వేదిక. ఈ లీగ్‌లో ఎన్నో రికార్డులు నమోదవుతాయి. అలా ఐపిఎల్ చరిత్రలో నమోదైన ఓ అరుదైన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. కేవలం 66 బంతుల్లోనే 175 పరుగలు చేసి.. ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డు సాధించాడు. చాలాకాలంగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న గేల్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ఆటగాళ్లకు రేటింగ్ కూడా ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి 7 పాయింట్లు ఇచ్చిన గేల్, కేఎల్ రాహుల్‌కు 8, హార్థిక్ పాండ్యాకు 7, శ్రేయస్ అయ్యర్‌కు 8 పాయింట్లు ఇచ్చాడు. ఇక శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్ యాదవ్‌లకు 9 పాయింట్ల కేటాయించారు. ఇక రిషబ్ పంత్, అభిషేక్ శర్మలకు 8వ ర్యాంకు ఇస్తున్నట్లు గేల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News