మైసూరు: కర్నాటకలోని మైసూరులో గుర్తు తెలియని వ్యక్తులు ఒక చర్చిలో విధ్వంసకాండకు పాల్పడ్డారు. బాల క్రీస్తు విగ్రహాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. పెరియపట్న ప్రాంతంలోని సెఎయింట్ మేరీస్ చర్చ్‌లో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని మైసూరు ఎస్‌పి సీమ లక్కర్ తెలిపారు. ఆధారాల కోసం సిసి టివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు.
బుధవారం ఉదయం 6 గంటలకు చర్చి తలుపులు తెరిచిన సిబ్బంది ఒకరు లోపల జరిగిన విధ్వంసాన్ని గురించి వెంటనే పాస్టర్‌కు తెలిపారు. ఆయన ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్చిలోపల ఉన్న హుండీలో ఉన్న డబ్బుతోపాటు చర్చి వెలుపల ఉన్న హుండీని కూడా దుండగులు కాజేయడంతో ఇది దొంగల పని కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Miscreants damaged statue of #JesusChrist kept at altar & took money 4m donation box from a #Church in periyapatna #Mysuru. Priest was away when the incident happened.Miscreant,however,didn't damage the main statue of Jesus.We are looking into all the angles: cops #Karnataka pic.twitter.com/5jitzu80GB
— Imran Khan (@KeypadGuerilla) December 28, 2022