Monday, December 23, 2024

ఫిబ్రవరి 15 లోగా క్రిస్టియన్ భవన్ టెండర్లు పూర్తిచేయాలి

- Advertisement -
- Advertisement -

రంజాన్‌లోగా మక్కా మసీదు పనులు పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫిబ్రవరి 15లోగా క్రిస్టియన్ భవన్ టెండర్లు పూర్తి చేయాలని ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం శుక్రవారం హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ బాగాయత్ లో శంకుస్థాపన చేసుకున్నామని, ఫారిన్ మోడల్‌లో క్రిస్టియన్ భవన నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి మోడల్స్‌ను మంత్రి పరిశీలించారు.

ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోగా టెండర్లు పిలిచి క్రిస్టియన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రంజాన్ నాటికి మక్కా మసీదు, జామియా నిజామియా, అనిసుల్ గుర్బా మరమ్ముత్తు, పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు మంజూరు అంశంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు రెండు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. పనుల పరిశీలన మబాధ్యతలు ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్ చూస్తారని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసి ఉల్లా ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పో రేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మైనారిటీ ప్రనిసపల్ సెక్రటరి అహ్మద్ నదీం, ఎండి కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News