Wednesday, January 22, 2025

తన మర్మాంగాన్ని తానే కోసుకుని…!

- Advertisement -
- Advertisement -

ఒక క్రైస్తవ మతాధికారి అనూహ్యమైన చర్యకు పాల్పడ్డాడు. తన మర్మాంగాన్ని తానే కోసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

చెక్ రిపబ్లిక్ లోని దక్షిణ బొహెమియాలో సెస్కోబుడెజోవిక్ ప్రాంతానికి చెందిన మతాధికారి ఒక సమావేశానికి హాజరు కావలసి ఉంది. ఎంతసేపటికీ ఆయన రాకపోవడంతో అనుమానంతో నిర్వాహకులు ఆయన ఇంటికి వెళ్లి చూడగా, ఆ మతాధికారి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి, మతాధికారి తన మర్మాంగాన్ని తానే కోసుకున్నట్లు తేల్చారు.

గత పది రోజులుగా కోమాలో ఉన్న మతాధికారిని బతికించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగిందో తమకు ఏమీ తెలియదని, అనారోగ్య కారణాలతోనే మతాధికారి ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చునని పట్టణ మేయర్ చెబుతున్నారు. అయితే మతాధికారి కొంతకాలంగా మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిందనీ, వ్యాధి ముదిరిన దశలో రోగులు మానసిక స్థిరత్వం లేకుండా ప్రవర్తించడం సహజమేనని డాక్టర్లు చెబుతున్నారు. బహుశా మతాధికారి మతి చలించిన స్థితిలో తన మర్మాంగాన్ని తానే కోసుకుని ఉండవచ్చునని వారు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News