Monday, December 23, 2024

క్రైస్తవ బుక్ స్టాల్‌పై హిందూత్వవాదుల దాడి (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనలో క్రైస్తవ మత సంబంధ పుస్తకాల స్టాల్‌పై హిందూత్వ సంస్థల కార్యకర్తలు విరుచుకుపడ్డారు. మార్చి 1వ తేదీన క్రైస్తవ ఆధ్యాత్మిక పుస్తకాల స్టాల్‌పై దాడి చేసిన హిందూత్వ సంస్థల కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయం కండువాలు ధరించి, నుదుట బొట్టు పెట్టుకున్న దాదాపు 30 మంది కార్యకర్తలు క్రైస్తవ మతానికి సంబంధించిన పోస్టర్లను చించివేశారు. మత మార్పిడుల కోసం పేద హిందూ కుటుంబాలను క్రైస్తవులు లక్షంగా చేసుకున్నారని వారుఆరోపించారు. హోలీ బైబిల్ ప్రతులను చించివేస్తూ బైబిల్ బంధ్ కరో, ధరమ్ పరివర్తన్ బంధ్ కరో&అంటూ నినాదాలు చేశారు. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News