Thursday, January 23, 2025

చర్చీలపై దాడులకు ఢిల్లీలో క్రైస్తవుల నిరసన!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చర్చిలపై దాడులు, హింస, అరెస్టులకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘం సభ్యులు ఆదివారం జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ‘ప్రజలను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. చర్చిలపై దాడులు చేస్తున్నారు. మా వాళ్లను కొట్టి, అరెస్టు చేస్తున్నారు. క్రైస్తవ కమ్యూనిటీ సభ్యులు నిరంతరం భయాందోళనలతో జీవిస్తున్నారు’ అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్టీవెన్ చెప్పారు. 2021లో సంఘం సభ్యులపై 525 దౌర్జన్య(అట్రాసిటీ) కేసులు, 2022లో 600 కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో, ఇటువంటి కేసుల సంఖ్య 2020లో 70 ఉండగా, 2022 నాటికి 183కి పెరిగాయి’ అని ఆయన పేర్కొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌కి చెందిన శివపాల్ బలవంతపు మతమార్పిడుల ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు ప్రజలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ‘మా ఇళ్లలో ప్రార్థన చేయడానికి కూడా మాకు అనుమతి లేదు. పుట్టిన రోజు వేడుకలో ప్రార్థనలు చేసినందుకు కొంతమంది మహిళలను అరెస్టు చేశారు’ అని అతడు చెప్పాడు.

సంఘంలోని సభ్యులపై దాఖలు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్)లలో ఒకటి 11ఏళ్ల వ్యక్తిపై, 2010లో మరణించిన ఒక వ్యక్తిపై ఉందని స్టీవెన్ ఆరోపించారు.

‘ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయి, మా సంఘం సభ్యులను వేధిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మా సోదరులు, సోదరీమణులకు సంఘీభావం తెలియజేయడానికి మేము ఇక్కడకు వచ్చాము’ అని ఢిల్లీ పంజాబీ బాగ్ నుంచి వచ్చిన పూనమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News