Wednesday, January 22, 2025

ఆప్ కార్యాలయంలో క్రీస్‌మస్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ శాంతిని ఆకాంక్షించిన గొప్ప దైవ దూత జీసస్
ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : మానవాళికి మేలుతోపాటు ప్రపంచ శాంతిని ఆకాంక్షించిన గొప్ప దైవ దూత జీసస్ అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. హైదరాబాద్‌లోని లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆప్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసు పుట్టిన రోజును పురస్కరించుకొని ఆప్ నేతలు ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు పండగ శుభాకాంక్షలను తెలిపారు.

క్రిస్మస్ గొప్పతనాన్ని అలాగే కరుణామయుడైన యేసు ప్రభువు లోక రక్షకుడు, శాంతి మార్గాన్ని ప్రబోధించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, డా. అన్సారీ, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ యమునా గౌడ్, ఆర్థిక కార్యదర్శి శ్రీకాంత్, దివ్యంగా విభాగం అధ్యక్షులు దర్శనం రమేష్, యువజన విభాగం అధ్యక్షులు సర్దార్ రందీర్ సింగ్, నేతలు శ్రీనివాస్ రెడ్డి, మౌనిక, వైశాలి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News