Monday, December 23, 2024

 మెదక్ చర్చిలో క్రిస్మస్ సందడి..

- Advertisement -
- Advertisement -

మెదక్ : ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి మెదక్ మహాదేవాలయం క్రిస్టమస్ వేడుకలకు అందంగా ముస్తాబైంది. రంగు రంగుల విద్యుత్ దీపాలు అమర్చి రాత్రుల్లో మిరుమిట్లు గొల్పేలా మహాదేవాలయాన్ని అలంకరించారు. ఈ క్రిస్టమస్ వేడుకలకు ఇతర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి క్రిస్టమస్ పర్వదినం రోజున ప్రభువును ప్రార్థిస్తారు.ఈ కార్యక్రమం మెదక్ డయాసిస్ రెవరెండ్ జార్జ్ ఎబినెజర్ రాజ్, బిషప్ సాలమోన్ రాజ్‌ల ఆద్వర్యంలో ఉదయం 4 గంటలకు ప్రత్యేక ఆరాధన ప్రారంభమవుతుంది.

నేడు మహదేవాలయంలో క్రీస్తు పుట్టిన ప్రదేశంగా భావించిన పశువుల పాకను ఏర్పాటు చేసి క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం క్రైస్తవ మతస్థుల సందేశాలతోపాటు బిషప్ తండ్రి రెవరెండ్ సాలమాన్‌రాజ్ క్రీస్తు జనన వృత్తంతపై మహా ప్రసంగం కొనసాగిస్తారు. అనంతరం భజనలు, భక్తిగీతాలతో భక్తులు క్రీస్తును స్మరించుకుంటారు.
మహా దేవాలయ ప్రస్థానం...
ప్రపంచ ప్రఖ్యాతి గాంఛిన మెదక్ కెథడ్రల్ చర్చ్ ఆసీయాలోనే రెండవ అతిపెద్దది, దీనిని చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు నిర్మించాడు. అప్పట్లో కఠోర కరువు చోటుచేసుకన్న నేపథ్యంలో పనికి ఆహారపథకం కింద ఈ చర్చిని నిర్మించడం జరిగింది. 1914లో దీని నిర్మాణం ప్రారంభమై 1924 సంవత్సరం డిసెంబర్ 25వ తేది నాడు పూర్తి చేసుకుని ప్రారంభించబడింది. 10 సంవత్సరాల నిర్మాణంలో సుమారు 5 వేల మంది కూలీలకు నిర్మాణ సమయంలో కడుపునింపింది. అందుకే మెదక్‌కు మెతుకుసీమ అనే పేరు కూడా వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ చర్చిని సందర్శించారు. వీరిలో కేవలం క్రైస్తవ మతస్తులే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన వారు చర్చి అందాలను తిలకించారు.

సిఎస్‌ఐ(సౌత్ ఆఫ్ చర్చ్ ఇండియా) ఆద్వర్యంలో వైద్య, విద్య, సామాజిక సేవలలో బోధనలు అందిస్తూ సేవలు చేస్తున్నారు. దీని నిర్మాణం మొదలై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇప్పటివరకు చెక్కుచెదరలేదు. విశేషమేమిటంటే ఈ చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్రామే వాడారు.లోపలి బాగమంతా ఇటలీలో తయారైనా రంగు రంగుల గాజు ముక్కలచే ఏసుక్రీస్తు జనానికి, అతని జీవిత చరిత్రకు సంబందించిన కళానైపుణ్యంతో నిర్మించబడి ఉంటుంది. ఇది కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటి సూర్యకాంతికి కళ్ళు మిరిట్లు గోలిపేలా కనబడుతుంది. ఈ చర్చి యొక్క ఎత్తు 175 అడుగులు, వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులతో సువిశాలమైన నిర్మాణం చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది.

క్రిస్టమస్ వేడుకలకు విదేశాల నుండి సైతం ఇక్కడికి భక్తులు వస్తుంటారు. బిషప్ రెవరెండ్ ఏసి. సాల్‌మాన్‌రాజ్ ఆద్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి. నేడు క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిని రంగు రంగుల విద్యుత్ దీపాల అలంకారంతో కళ్ళు జిగేల్ మనేలా మెరిసిపోతుంది. ఈ కిస్టమస్ వేడుకల సందర్భంగా వచ్చిన భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్చి కమిటీ సభ్యులు పలు సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News