దేశంలో మొట్టమొదటి, టాటా గ్రూప్‌కు చెందిన ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, తెలంగాణాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ సుప్రసిద్ధ వ్యవసాయ కేంద్రం మహబూబ్ నగర్‌లో అవంతి క్లాంప్లెక్స్, కమలా నెహ్రూ కాలనీ వద్ద తమ మొదటి స్టోర్‌తో పాటుగా వ్యవసాయ, గ్రానైట్ పరిశ్రమ వ్యాపారులకు ఖ్యాతి గడించిన కరీంనగర్‌లో ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కాలేజీ ఎదురుగా కావేరీ స్క్వేర్ వద్ద మరో స్టోర్‌ను ప్రారంభించింది.
నగరంలో మొట్టమొదటి జాతీయ స్ధాయి లార్జ్ ఫార్మాట్ స్పెషలిస్ట్ ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్‌గా నిలిచిన క్రోమా , 550 కు పైగా బ్రాండ్ల వ్యాప్తంగా 16వేలకు పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహబూబ్‌నగర్‌లో ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థ , వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. జిల్లా ప్రధాన కేంద్రం కావడం చేత ప్రభుత్వ కార్యాలయాలు, ఇనిస్టిట్యూట్‌లు కూడా అధికంగా ఉంటాయి. అదే సమయంలో కరీంనగర్ కూడా వ్యవసాయానికి ఖ్యాతి గడించడంతో పాటుగా గ్రానైట్ పరిశ్రమలకు సుప్రసిద్ధి. ఈ కారణాల చేత ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి.
మహబూబ్ నగర్‌లో 9788 చదరపు అడుగులు మరియు కరీంనగర్‌లో 8649 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్లు రెండూ కూడా రెండు అంతస్తులలో ఉన్నాయి. ఇక్కడ వినియోగదారులు అత్యున్నత అనుభవం, నైపుణ్యం కలిగిన క్రోమా ఎక్స్‌పర్ట్స్ నుంచి కొనుగోలు సమయంలో అవసరమైన సహాయాన్ని పొందగలరు. ఈ స్టోర్‌లలో వినియోగదారులు తాజా శ్రేణి ఉత్పత్తులను అన్వేషించవచ్చు. వీటిలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ఉపకరణాలు, కూలింగ్ సొల్యూషన్స్, గృహోపకరణాలతో పాటుగా ఆడియో మరియు సంబంధిత యాక్ససరీలు ఉంటాయి. క్రోమా యొక్క కొనుగోలు అనంతర సేవలను సైతం వీరు పొందడంతో పాటుగా నైపుణ్యంతో కూడిన సలహాలను సైతం పొందవచ్చు . అలాగే తమ కొనుగోళ్లకు సంబంధించి అత్యన్నత అనుభవాలను పొందేందుకు షెడ్యూల్డ్ అభ్యాస కార్యక్రమాలలో సైతం వీరు పాల్గొనవచ్చు.
క్రోమా ఇన్ఫినిటీ–రిటైల్ లిమిటెడ్, ఎండీ–సీఈఓ అవిజిత్ మిత్రా మాట్లాడుతూ ‘‘ మా నూతన స్టోర్లను మహ బూబ్ నగర్, కరీంనగర్‌లలో ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. అత్యున్నత శ్రేణి, సమగ్రమైన షాపింగ్ అనుభవాలను అందించడం మా లక్ష్యం మరియు మా వినియోగదారులకు జీవితకాలపు సేవలను మా ఎలకా్ట్రనిక్స్ నిపుణులతో అందించగలమని భరోసా అందిస్తున్నాము. భారతదేశ వ్యాప్తంగా మేము మా సేవలను విస్తరించడంతో పాటుగా ఎలకా్ట్రనిక్స్ షాపింగ్ నేపథ్యంను పునర్నిర్వచించనున్నాము’’ అని అన్నారు. క్రోమా స్టోర్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఏడు రోజులూ తెరిచి ఉంటాయి.