Wednesday, January 8, 2025

ప్రసవం తరువాత మహిళల్లో దీర్ఘకాల అనారోగ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏటా ప్రసవం తరువాత 40 లక్షల మంది మహిళలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఒ)కు చెందిన పరిశోధకులతోపాటు అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. పసవాంతర స్త్రీలలో మూడో వంతు కన్నా అంటే 35 శాతం మందికి సంభోగ సమయంలో భరించలేని బాధ కనిపించగా, 32 శాతం మంది వీపు కింద వెన్నునొప్పి అనుభవిస్తున్నారని నివేదిక వివరించింది. ప్రసవాంతర మహిళల్లో అసంకల్పిత మూత్ర విసర్జన 8 నుంచి 31 శాతం మంది, ఆందోళన 924 శాతం, కుంగుబాటు 1117 శాతం, యోని నొప్పిగా ఉండటం 11 శాతం మంది, తదితర అవలక్షణాలు కనిపిస్తున్నాయని నివేదిక తెలియజేసింది. ప్రసవాంతర సమస్యల అధికభారం కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు వెంటాడుతుంటాయని తేలింది. ప్రసవానంతరం ఆయా మహిళలకు తగిన సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మందికి తీరని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

అందుకని ఆరోగ్యభద్రత వ్యవస్థలో ఈ సమస్యల పట్ల తగిన శ్రద్ధ అవసరమని పరిశోధకులు హెచ్చరించారు. ఈ చిక్కులను గుర్తించి, సంక్లిష్టతలను తప్పించడం అన్నది గర్భస్రావ సమయం లోను, ప్రసవించిన తరువాత కూడా క్లిష్టమైన అంశం గానే ఉంటోంది. స్వల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ముఖ్యంగా ప్రసూతి మరణాలు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి చాలా అధ్యానంగా ఉంటోంది. గత 12 ఏళ్లుగా ఈ అధ్యయన సాహిత్య సమీక్షలో పరిశోధకులు 32 ప్రాధాన్య అంశాల్లో కనీసం 40 శాతం అయినా అత్యధిక నాణ్యమైన చికిత్సకు సంబంధించి మార్గదర్శకాలు ఏ దేశం నుంచీ వెలువడ లేదని గుర్తించారు. ముఖ్యంగా స్వల్పాదాయ, మధ్యాదాయ దేశాల నుంచి కనీసం ఒక నాణ్యమైన మార్గదర్శకం కూడా వెలువడలేదు. ప్రసవాంతర సమస్యలు మహిళల దైనందిన జీవితంలో అనేక చిక్కులను కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ పాస్కాల్ అలాటీ పేర్కొన్నారు. మాతృత్వంతోపాటు మహిళలకు తగిన వైద్య సేవలు అందేలా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News