Friday, November 22, 2024

చక్ దే ఇండియా !

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో మరోసారి ట్రోఫీని ముద్దా డాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య టీమిం డియా ఆదివారం పటిష్టమైన ఆస్ట్రేలి యాతో జరిగే తుది పోరాటానికి సమరో త్సాహంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా ఉన్న భారత్ ఫైనల్లోనూ గెలిచి మూడో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుసగా 8 మ్యాచుల్లో గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆస్ట్రేలియా కూడా ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవా లనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. కాగా, వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. 8సార్లు ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడింది. ఈసారి కూడా విశ్వ విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు భారత్ వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది నాలుగో సారి. ఇప్పటి వరకు భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా నిలి చింది. 2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసా గించాలని భావిస్తోంది. అంతేగాక 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ సమరంపై సర్వత్రా ఆసక్తి నెల కొంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో తుది పోరు నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయం.

జోరుమీదున్న రోహిత్, గిల్
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జోరుమీదుండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ప్రతి మ్యాచ్‌లోనూ ఇద్దరు జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నాడు. కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

ఆ ఇద్దరూ చాలా కీలకం..
మరోవైపు వరుస సెంచరీలతో ప్రపంచకప్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు కూడా ఫైనల్లో జట్టుకు కీలకంగా మారారు. ఇద్దరు సెమీస్‌లో శతకాలతో చెలరేరారు. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతున్నారు. కోహ్లి ఇప్పటికే మూడు శతకాలు, ఐదు అర్ధ సెంచరీలతో సహా రికార్డు స్థాయిలో 711 పరుగులు సాధించాడు. అతను అద్భుత ఫామ్‌లో ఉండడం టీమిండియాకు సానుకూల పరిణామంగా చెప్పాలి. శ్రేయస్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు సాధించి సత్తా చాటాడు. ఫైనల్లో కూడా శ్రేయస్ నుంచి ఇలాంటి బ్యాటింగ్‌నే జట్టు ఆశిస్తోంది. కెఎల్ రాహుల్ కూడా జోరుమీదున్నాడు. ఇప్పటికే కళ్లు చెదిరే శతకంతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాల రూపంలో మరో ఇద్దరు విధ్వంసక బ్యాటర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లకు కష్టాలు ఖాయమనే చెప్పాలి.

షమి హవా సాగాలి..
ఇక బౌలింగ్‌లో కూడా టీమిండియా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. మహ్మద్ షమి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ అసాధారణ బౌలంగ్‌తో ఆకట్టుకున్నాడు. కివీస్‌తో జరిగిన సెమీస్ సమరంలో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈసారి కూడా షమిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అద్భుత బౌలింగ్‌తో షమి వరల్డ్‌కప్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే 23 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫైనల్లోనూ చెలరేగాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. బుమ్రా కూడా నిలకడైన బౌలింగ్‌తో అలరిస్తున్నాడు. షమి, బుమ్రాలు తమ మార్క్ బౌలింగ్‌తో చెలరేగితే భారత్‌కు తిరుగే ఉండదు. ఇక సిరాజ్, జడేజా, కుల్దీప్‌లతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News