Monday, January 20, 2025

నగరంలో చుడిదార్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

గరంలోని ఎస్‌ఆర్ నగర్ ఫోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ చోరీ కలకలం సృష్టించింది. ఇప్పటి వరకు నగరంలోని చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేసేవారు. కొత్తగా చుడీదారు వేసుకుని చోరీలు చేయడంతో నగరంలో ఇదే మొదటి సారి. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్‌కాలనీ, ఆకృతి ఆర్కెడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వరరావు కుటుంబంతోపాటు ఉంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు చుడీదార్ వేసుకుని అపార్ట్‌మెంట్‌కు వచ్చారు,

వేలిముద్రలు ఎక్కడా పడకుండా గ్లౌజులు, ముఖానాకి స్కార్ప్ కట్టుకుని సిసి కెమెరాలో ఫుటేజ్‌లో కూడా గుర్తించాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుని వచ్చారు. ఇద్దరు నిందితులు వచ్చి తాళం వేసిన వెంకటేశ్వరరావు ఫ్లాట్‌కు వెళ్లి ఇంట్లోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు, లక్ష నగదు, ల్యాప్‌టాప్‌ను చోరీ చేశారు. నిందితులు అపార్ట్‌మెంట్‌కు వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు ఫ్లాట్ కోసం వెతికి మరీ చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలిసిన వారి పనేనా….
దొంగతనానికి వచ్చిన నిందితులు అపార్ట్‌మెంట్‌లో అన్ని ఫ్లాట్లు ఉన్నా కూడా కేవలం వెంకటేశ్వరరావు ఫ్లాట్‌లోనే చోరీ చేశారు. ఇది అనుమానాలకు తావిస్తోంది, మిగతా ఫ్లాట్లను వదిలేసి వెంకటేశ్వరరావు ఫ్లాట్‌లో చోరీ చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాళం వేసి ఉన్న విషయం దొంగలకు ఎలా తెలిసిందని, వేరే ఫ్లాట్ల జోలికి వెళ్లకుండా దీనిలోనే చోరీ చేయడంపై తెలిసిన వారే చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News