Monday, December 23, 2024

హైదరాబాద్ లో చుడీదార్ గ్యాంగ్ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం సృష్టిస్తుంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి జెక్ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో దుండగులు చుడీదార్ వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ ను చుడీదార్ వేసుకున్న గ్యాంగ్ దొంగతనం చేసింది. ఇద్దరు దుండగులు చుడీదార్ ధరించి దొంగతనానికి పాల్పడిన వీడియో సిసి టివి ఫూటేజీలో నిక్షిప్తమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News