Monday, January 20, 2025

భావి తరాలకు ‘చుక్కా’ని

- Advertisement -
- Advertisement -

నేడు చుక్కా రామయ్య 99వ జన్మదినోత్సవం
విద్యాదినోత్సవంగా
అభిమానుల కితాబు
సామాజిక కార్యకర్త,
స్వాతంత్య్ర సమరయోధుడు,
విద్యావేత్త, ప్రజా ప్రతినిధిగా
బహుముఖ ప్రజ్ఞాశాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : చుక్కా రామయ్య అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అసలు ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో చుక్కా రామయ్య అంటే తెలియని వారు ఉండవచ్చునేమో, కానీ ఐఐటి రామయ్య అంటే బహుశా తెలియని ఉండకపోవచ్చు. చుక్కా రామయ్య కంటే ఐఐటిగా ఆయన సుపరిచితుడు. దేశవ్యాప్తంగా ఐఐటి ప్రవేశాలకు శిక్షణ ఇచ్చే సంస్థలు ఎన్నో ఉన్నా, వ్యక్తులు ఎందరో ఉన్నా వాటిలో వేటికి, ఎవరికీ కూడా ఐఐటి ఇంటిపేరుగా మారిన దాఖలాలు లేవు.

ఈ అరుదైన ఖ్యాతి చుక్కా రామయ్య ఒక్కరికే సొంతం.
ఐఐటి రామయ్య ఇన్సిస్టిట్యూట్‌లో శిక్షణ పొంది ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే వారి ఎదుగుదల వెనక చుక్యా రామయ్య పడిన కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలనే కారణమని చెప్పవచ్చు. చుక్కా రామయ్య పరిభాషలో చెప్పాలంటే ఐఐటిలో సీటు సంపాదించడానికి అభ్యర్థులు ఎంతగా కష్టపడుతారో, వారితో సమానంగా తాను ప్రతి ఏటా ఐఐటికి ప్రిపేర్ అయ్యేవాడినని చెబుతారు. ఒక విశ్రాంత ఉపాధ్యాయునిగా కాకుండా నిత్య విద్యార్థిగా చుక్కా రామయ్య పడిన కష్టానికి, పట్టుదలకు ఫలితమే ఆయన ఇంటి పేరు ఐఐటి రామయ్యగా మారడానికి కారణమైంది.

ఒక విద్యారంగంలోనే కాదు, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్ర సమరయోధునిగా, విద్యావేత్తగా, ప్రజాప్రతినిధిగా ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి చుక్కా రామయ్య. అనేక రంగాలలలో రాణించిన మిమ్మల్ని విద్యావేత్తగా పిలువాలా? రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధునిగా పిలువాలా? స్వాతంత్ర సమరయోధునిగా పిలువాలా? ప్రశ్నిస్తే, ‘సామాన్య పౌరుడిగా గుర్తు పెట్టుకుంటే చాలు, చాలా మంది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు&వారిలో నేను ఒకడిని’ అని అంటారాయన.

విద్యార్థి దశలోనే నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్ల అగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చుక్కా రామయ్య 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన మలి దశ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ, ఐఐటీ రామయ్యగానే ఈ తరానికి సుపరిచితులైన మీకు ఐఐటీ ఇన్సిస్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగితే, నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన తాను అప్పట్లో 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 53 ఏళ్లకే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాను. మా అమ్మాయి ఐఐటీకి ఎంపికైంది. ఆ సందర్భంగా అడ్మిషన్ ప్రక్రియకు అమ్మాయికి తోడుగా వెళ్లినప్పుడు అక్కడ 4 వందల మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. కానీ అందులో తెలుగువారు వేళ్లపై లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక ఐఐటీలో తెలుగు విద్యార్థులు లేకపోవడం ఏమిటి? అని ఆశ్చర్యపోయాను. అందులో నుంచి పుట్టిన ఆలోచననే ఐఐటీ కోచింగ్ సెంటర్ ప్రారంభించడానికి కారణమైంది అని అంటారు.

తెలంగాణ రాష్ట్ర విద్యా దినోత్సవంగా&

చుక్కా రామయ్య నవంబర్ 20న 98వ ఏండ్లు పూర్తి చేసుకొని 99వ ఏటా ప్రవేశించబోతున్నారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన శిష్యులు చుక్కా రామయ్య 98వ జన్మదినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యా దినోత్సవ వేడుకగా నిర్వహించుకోవడం విశేషం.

చుక్కా రామయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగామ జిల్లా) గూడూరు గ్రామంలో 20నవంబర్ 1925లో జన్మించారు. నిజాం హయాంలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక జరిగిన పోరాటంలో పాల్గొన్న కారణంగా పోలీసులు అరెస్టు చేసి ఔరంగబాద్ జైలులో పెట్టారు. ఆ తర్వాత 1950లో స్కూల్ టీచర్‌గా ఉద్యోగంలో చేరి, ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు 1969లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించి ఆ తర్వాత అదే సంవత్సరం అసిస్టెంట్ లెక్చరర్‌గా జాయిన్ అయ్యారు.

ఆ తర్వాత అంచెలంచలుగా ఎదిగి చివరకు 1983లో నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్‌గా పని చేస్తూ ఉద్యోగ విరమణకు ఐదు సంవత్సరాలకు ముందుగానే ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తర్వాత ఐఐటీ కోచింగ్ సెంటర్ స్థాపించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట వేసారు. హైదరాబాద్‌లో చుక్కా రామయ్య చేసిన కృషి ఫలితంగానే ఐఐటీ నెలకొల్పారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

విద్యారంగంలో విశేష కృషి

చుక్కా రామయ్య విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన ఈ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై 16 పుస్తకాలు రచించారు. వీటిలో బడి పంతుళ్లకు రాజకీయాలా?, చదువుల తోవ, చదువులో సగం, చిట్టి చేతులు, దర్యాప్తు, ఈ మట్టి రుణం తీర్చుకుంటా, జ్ఞానలోగిళ్లు, లాఠీచార్జ్, మన చదువులు, ప్రాథమికం, ప్రపంచీకరణ_ విద్య,సంక్షేమ విద్య, సంవాదం, తరగతి, దేశ దేశాల్లో విద్య తదితర పుస్తకాలను రచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News