Sunday, December 22, 2024

మంత్రి ఎర్రబెల్లికి చుక్కా రామయ్య ఆశీర్వాదం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన రామయ్య హైదరాబాద్‌లో ఉంటున్నారు. మంగళవారం వారి ఇంటికి వెళ్లి ఆయనతో మంత్రి కొద్ది సేపు మాట్లాడి, ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తాను పాలకుర్తి బిఅర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. త్వరలోనే వచ్చి కలుస్తామని మాట ఇచ్చారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చుక్కా రామయ్యను కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో వచ్చిన సమస్యలతో సతమతం అవుతున్న రామయ్య త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News