ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ మూడో పాటగా ‘పల్లి పల్లి బెల్లం పల్లి..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
తొలి పాటను హైదరాబాద్, రెండో పాటను చెన్నై గ్రాండ్ లెవల్లో విడుదల చేసిన మేకర్స్ మూడో పాటను దర్శకుడు, నిర్మాత ఆర్.చంద్రు తన హోం టౌన్ షిడ్ల గట్టలో విడుదల చేశారు. భారీ ఎత్తును ఈవెంట్‌ను నిర్వహించి ఆడియెన్స్ సమక్షంలోనే ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శాండిల్ వుడ్ కింగ్ శివ రాజ్‌కుమార్ చేతుల మీదుగా పాట విడుదలైంది. హెల్త్ మినిష్టర్ కె.సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం.రెవన్న, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆనంద్ పండిట్, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘పల్లి పల్లి బెల్లంపల్లి’ అంటూ సాగే ఈ పాట పక్కా మాస్ సాంగ్. ఉపేంద్ర, తాన్యా హోప్ ఈ పాటలో నర్తించారు. కె.జి.యఫ్ ఫేమ్ రవిబస్రూర్ సంగతం అందించిన ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా హరిణి ఇవ్వటూరి, సంతోష్ వెంకీ పాడారు. ఆనంద్ ఆడియోకి సంబంధించిన యూట్యూబ్ చానెల్‌లో ఈ లిరికల్ సాంగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆర్.చంద్రు ఇది వరకే కొన్ని అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నేను కూడా భాగం కావటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మూవీ కూడా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. స్టేజ్‌పై ఈ పాటకు ఆయన తన సతీమణి గీతా శివరాజ్‌కుమార్‌తో కలిసి స్టెప్పులేయటం విశేషం.
హెల్త్ మినిష్టర్ కె.సుధాకర్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది నేను బెంగుళూరులో జరిగిన రాజమౌళిగారు డైరెక్ట్ చేసిన RRR సినిమా ఆడియోను విడుదల చేశాను. అందులో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడు కబ్జ పాటలు వాటి కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా అంతా కన్నడ సినిమాలను చూస్తున్నాయి. కబ్జ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు, నిర్మాత ఆర్.చంద్రు మాట్లాడుతూ ‘‘ఈవెంట్‌కు హాజరైన అతిథులకు, ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు. కబ్జ సినిమాకు, పాటలకు వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్‌తో పాటు అభిమానులు కూడా కబ్జ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇండియా లెవల్లో 1800 థియేటర్స్ లో విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు రవి బస్రూర్ రియల్ హీరో. మాస్, క్లాస్, మెలోడీలతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే ఆర్.చంద్రు ఈ సినిమాతో ఓ ఫెస్టివల్‌ను క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు చంద్రు ఎక్కడా కథను రివీల్ చేయలేదు. అదే సినిమాకు మెయిన్ హైలైట్’’ అన్నారు.