Thursday, January 23, 2025

లంచం ఇచ్చిన బిజినెస్‌మెన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Churchit Mishra arrested in bribery case

ఒడిషా పరదీప్ పోర్టుపై సిబిఐ నిఘా

న్యూఢిల్లీ : లంచం ఇచ్చిన కేసులో సిబిఐ స్పందించింది. ఒడిషాకు చెందిన పారిశ్రామికవేత్త చర్చిత్ మిశ్రాను అరెస్టు చేశారు. ఈ వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఒడిస్సా స్టీవెడోర్స్ లిమిటెడ్ ( ఒఎస్‌ఎల్) ఎండి అయిన మహిమానంద మిశ్రా చిన్న కుమారుడు. ఓ లావాదేవీలకు సంబంధించి జూనియర్ మిశ్రా పాతిక లక్షల లంచాన్ని పరదీప్ పోర్టు ట్రస్టు అధికారికి ఇచ్చినట్లు ఫిర్యాదులు అందడంతో చర్చిత్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి సిబిఐ బిల్డర్ శిశిర్ కుమార్ దాస్‌ను కూడా అరెస్టు చేసింది. ఈ లంచాల వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా పోర్టు ట్రస్టు ప్రధాన మెకానికల్ ఇంజనీర్ సరోజ్ కుమార్ దాస్ ఉన్నారు. ఇండియాలో అతి పెద్ద కార్గో నిర్వాహక కంపెనీలలో స్టీవెడోర్స్ సంస్థ ఉంది. ఈ సంస్థ సరుకులను దింపుతుండగా పోర్టు వద్ద కన్వేయర్ బెల్టు దెబ్బతింది. సంస్థ ఈ బెల్టును మరమ్మతు చేయకుండా వదిలేసేలా చేయాలంటే రూ 60 లక్షలు ఇవ్వాలని అధికారి లంచం అడిగారు. అవినీతి అంశంపై ముందుగా అధికారిని అరెస్టు చేసిన తరువాత చర్చిత్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ నలుగురు నిందితులను నాలుగురోజుల సిబిఐ కస్టడీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News