Wednesday, December 25, 2024

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు భారత యాత్రికులు మృతి

- Advertisement -
- Advertisement -

కాట్మాండూ: నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీత్‌పూర్ సిమారాలోని చురియమై దేవాలయం సమీపంలో బస్సు లోయలో పడడంతో ఆరుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హెటౌడలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. భారత్‌కు చెందిన యాత్రికులు కాట్మాండూ నుంచి జానక్‌పూర్ వెళ్తుండగా 15 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపుగా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News