Sunday, December 22, 2024

భీమడోలు లాకప్ డెత్ కేసు.. సిఐ, ఎస్ఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ఏలూరు: భీమడోలు లాకప్ డెత్ కేసులో సిఐ సుబ్బారావు, ఎస్ఐ వీరభద్రరావులు సస్పెండ్ అయ్యారు. బుధవారం భీమడోలు పోలీస్ స్టేషన్ లో నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అప్పారావు అనే వ్యక్తిని చోరీ చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. గత మూడు రోజులుగా పోలీస్ స్టేషల్ లో ఉన్న నిందితుడు బుధవారం ఉదయం బాత్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో నిందితుడు చనిపోవడంపై బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు రావడంతో భీమడోలు సిఐ, ఎస్ఐలను ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

CI and SI Suspended in Bhimadole Lockup Death Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News