Sunday, December 22, 2024

గుండెపోటుతో సిఐ మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గలో సిఐ గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లింగరాజు అనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్(36) బెంగళూరులో పని చేస్తున్నారు. గతంలో ఎస్‌ఐ పలు ప్రాంతాలలో విధులు నిర్వహించడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. బుధవారం రాత్రి బెంగళూరు నుంచి చిత్రదుర్గకు వెళ్లి లాడ్జిలో బస చేశారు. లాడ్జిలో బస చేస్తుండగా గుండెపోటుకు గురికావడంతో మృతి చెందాడు. లాడ్జి నిర్వహకుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News