Wednesday, January 22, 2025

అలా చేసినా కూడా సిఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోరా?…. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి మీద చేయి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాప్ ఎందుకు మూసివేయలేదంటూ సిఐ ఇంద్రసేనారెడ్డి రెచ్చిపోయి దుకాణదారుడిని తిడుతూ చెంప చెళ్లమనిపించాడు. దీనిపై ఇప్పటి వరకు సిఐ కానీ పోలీస్ ఉన్నతాధికరులు కూడా వివరణ ఇవ్వలేదు. గతంలో కరీంనగర్‌లో తాగిన మైకంలో ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.  రాష్ డ్రైవింగ్‌లో కాళేశ్వరం బొక్కల కుంట చెరువులోకి ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది.

రక్షించడానికి వచ్చిన గ్రామస్థులతో ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చేస్తానంటూ గ్రామస్థులను బెదిరించారు. అదే చెరువు దగ్గర తన మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. గ్రామస్థులు ఎదురుతిరగడంతో ఘటనా స్థలం నుంచి ఎస్‌ఐ పారిపోయాడు. ఇటీవల సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ట్రాఫిక్ ఎస్‌ఐగా ఇంద్రసేనారెడ్డిని బదిలీ చేశారు.  ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఓ కాంట్రాక్టర్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపించిన ఆరోపణలు అతడిపై ఉన్నాయి. సామాన్యులను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వివాదాస్పద పోలీసులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News