Monday, January 20, 2025

జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించిన లేడీ సింగం

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సిఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సిఎం జగన్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద నుంచి జనసేన కార్యకర్తలు వెళ్లకపోడంతో కోపంతో రగిలిపోయిన సిఐ అంజు యాదవ్ జనసేనకార్యకర్త చెంప చెల్లుమనిపించింది. రెండు చేతులతో జనసేన కార్యకర్తలు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సిఐ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు దుమారం లేపాయి.

Also Read: ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు… పాకిస్తాన్‌లో ఆడబోము: బిసిసిఐ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News