Monday, December 23, 2024

పోలీసు బ్యాడ్మింటన్ టోర్నీకి ఎంపికైన సిఐ శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: ఆల్ ఇండియా పోలీసు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నికి మహబూబాబాద్ జిల్లాలో టాస్క్‌ఫోర్స్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఎంపికైయ్యారు. ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో ఆల్ ఇండియా పోలీసు బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్రీడోత్సవాలకు మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఎంపిక కావడం పట్ల ఎస్పీ అభినందించారు.

ఈ మేరకు ఆయనకు లోయర్, టీషర్టు కలిగిన ట్రాక్ సూట్‌తో పాటు షూష్ అందించి ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి జిల్లా పోలీసులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోలీసు శాఖ తరుపున ఎంపికై చండిఘడ్‌లో ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీసు క్రీడోత్సవాలలో సీఐ శ్రీనివాస్ పాల్గోననున్నారని ఎస్పీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News