Monday, January 20, 2025

కారులో డబ్బులు తరలిస్తూ దొరికిన సిఐ సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. అక్రమంగా డబ్బులు తరలిస్తూ దొరికిన సిఐ అంజిత్ రావుపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్లలో సిఐ అంజిత్ కారులో డబ్బులు తరలిస్తుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకుని ఎక్సైజ్ శాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిఐని అదుపులోకి తీసుకుని రూ.6లక్షల నగదుతోపాటు కాను సీజ్ చేశారు. అనంతరం సిఐ అంజిత్ రావును సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిషన్ లేకుండా హెడ్ క్వాటర్స్ వదిలి వెళ్లడంతో సిఐని సస్పెండె చేసినట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News