Monday, January 20, 2025

ప్రజాభవన్ కారు కేసు… మాజీ ఎంఎల్ఎ కుమారుడిని తప్పించిన ఖాకీలు

- Advertisement -
- Advertisement -

మాజీ ఎంఎల్‌ఎ కుమారుడిని తప్పించిన పోలీసులు
అతడి డ్రైవర్‌కారు నడిపినట్లు చూపిన ఖాకీలు, విచారణలో వెలుగులోకి
పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
మన తెలంగాణ/ సిటీ బ్యూరో : ప్రజాభవన్ వద్ద శనివా రం అర్ధ్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్లక్షంగా కారు నడపడంతో ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి 2.45 గంటలకు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు కారు నడిపిన బోదన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా సో హైల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తన అనుచరులను పోలీస్ స్టేషన్‌కు పంపించి పోలీసులతో మాట్లాడడంతో సీన్ మా రింది. మాజీ ఎంఎల్‌ఎ కుమారుడిని తప్పించి అతడి ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను కారు నడిపినట్లు చేర్చారు. ఈ విషయంపై పలు ఆరోపణలు రా వడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి వి చారణకు ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ డిసిపి విజయ్‌కుమార్ దర్యాప్తు చేసి నిజాలు రాబట్టారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్‌కు వ చ్చిన విషయం సిసిటివి ఫుటేజీలో తేలింది. మాజీ ఎమ్మె ల్యే కుమారుడిని తప్పించి పోలీసులు వేరే వ్యక్తిపై కేసు న మోదు చేశారని విషయం బయటపడింది. తాను కారు డ్రై వింగ్ చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయిన అబ్దుల్ ఆసిఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కారులో ఉన్న మరో యువకుడిని పరీక్ష నిర్వహించగా మద్యం తాగనట్లు తెలిసింది. కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. షకీల్ కుమారుడు సాహిల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాహిల్ పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఉన్నతాధికారులు విచారణతో…

ఉన్నతాధికారులు కారు ప్రమాదం కేసులో స్టేషన్‌కు వచ్చి విచారణ చేయడంతో ఇన్‌స్పెక్టర్‌కు ఒక్కసారిగా బీపి పెరిగి ఆస్పత్రి పాలయ్యాడు. మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించే క్రమంలో తాము ఇరుక్కున్నామని పోలీసు లు భావిస్తున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఇన్‌స్పెక్టర్ చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇన్‌స్పెక్టర్, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సాహిల్‌తోపాటు మిగతా వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అయితే ఈ కేసుపై విచారణ చేసిన డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ నివేదికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి సమర్పించనున్నారు. దానికి అనుగుణంగా పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎంఎల్‌ఎ కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో మిగతా పోలీసులపై కూడా వేటుపడే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News