Monday, December 23, 2024

సంతోష్ నగర్ సిఐ పై వేటు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మహిళా ఎస్సైని లైంగికంగా వేధిస్తున్న సంతోష్‌నగర్ ఇన్స్‌స్పెక్టర్‌ను అటాచ్డ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ణ,ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న వంశీకృష్ణ గత కొంత కాలం నుంచి మహిళా పోలీస్ అధికారిని లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. రానురాను వంశీకృష్ణ వేధింపులు ఎక్కువ కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌కు ఆ అధికారి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేసిన సిపి సివి ఆనంద్ వేధింపులు నిజమని తేలడంతో ఇన్స్‌స్పెక్టర్ వంశీకృష్ణపై వేటు వేశారు.

పూర్తి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇన్స్‌స్పెక్టర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. గతంలో లాలాగూడ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేసి వ్యక్తి అదే స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు దిగడంతో విచారణ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News